Vaishnavi Bhargavi Vaagdevi - Cover by Sarada



A divine song from the classic film Swathi Kiranam praising Goddess Saraswathi, Goddess of music and literature.

Lyrics in Telugu:

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే
వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే
భవతీ విద్యామ్ దేహి భగవతీ  సర్వార్థ సాధికే  సత్యార్థ చంద్రికే
మాంపాహి మహనీయ మంత్రాత్మికే
మాంపాహి మాతంగి మాయాత్మికే ||

ఆపాత మధురము సంగీతము
అంచిత సంగాతము సంచిత సంకేతము 
శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము అమృత సంపాతము సుకృత సంపాకము
సరిగమ స్వరధుని సార వరూధిని సామ సునాదవినోదినీ
సకల కళా కల్యాణి సుహాసిని శ్రీ రాగాలయ వాసిని 
మాంపాహి మకరంద మందాకినీ
మాంపాహి సుజ్ఞాన సంవర్ధినీ ||

ఆలోచనామృతము సాహిత్యము
సహిత హిత సత్యము శారదా స్తన్యము 
సారస్వతాక్షర సారథ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము
సరస వచోఘ్రిణి సారస లోచని వాణీ పుస్తక ధారిణీ
వర్ణాలంకృత వైభవ శాలిని వరకవితా చింతామణి
మాంపాహి సాలోక్య సంధాయినీ 
మాంపాహి శ్రీ చక్ర సింహాసినీ || 
Title: Vaishnavi Bhargavi Vaagdevi
Film : Swathi Kiranam (Telugu)
Lyrics: Sirivennela Seetarama Sastry
Music: K.V.Mahadevan
Original Singer(s): Vani Jayaram
Sung By: Sarada




1 comment: